జాతకం అంటే ఏమిటి?
ఏ మనిషికైనా భవిష్యత్తు గురించి కొద్దో గొప్పో బెంగ ఉండే ఉంటుంది. రేపు తనకు జరగబోయే శుభాశుభాలను గురించి తెలుసుకోవటం, ఏవైనా బాధలుంటే వాటికి నివారణోపాయాలను వెతుక్కోవాలనుకోవటం, ప్రతిక్షణం సుఖసంతోషాలతో జీవించాలనుకోవటం మనిషి నైజం. ఆ సుఖవంతమైన జీవితం అన్వేషణలోనే ఎన్నో రకాల శాస్త్రవిషయాలను కనుక్కోవటం జరుగుతున్నది. అయినప్పటికి భవిష్యత్తును తెలుసుకోవాలన్నా, దానిని సుఖవంతముగా మార్చుకోవాలన్నా అది ఒకే ఒక శాస్త్రంతోనే సాధ్యమవుతుంది. అదే జ్యోతిష శాస్త్రం.జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనము జన్మించిన సమయానికి ఖగోళములోని గ్రహస్థితులను సూచిస్తూ వేయబడే చక్రాన్నే జాతకము అంటారు. దీనినే జాతకచక్రము, జన్మకుండలి, హోరోస్కోప్ ఇలా వివిధ రకాల పేర్లతో ఆయా ప్రాంతాలవారు సంబోధిస్తుంటారు. ఒక వ్యక్తి జన్మించిన సమయము, ప్రదేశము ఆధారముగా జాతకచక్రము గణించబడుతుంది. ఖగోళములోని గ్రహస్థితులను గణితాధారముగా లెక్కించి, ఆయా రాశి, నక్షత్ర, భావాలలో ఉన్న గ్రహాల ఆధారముగా భవిష్యత్తు చెప్పబడుతుంది.దీని గణనలో కాని, జన్మించిన సమయములో కాని తప్పు జరిగినట్లయితే అది ఆ నిర్దేశిత వ్యక్తి జాతకం కాక వేరే వారి జాతకం అవటమే కాకుండా, ఈ వ్యక్తికి చెప్పబడ్డ భవిష్య ఫలాలన్నీ తప్పే అవకాశం ఉంటుంది.కాబట్టి భవిష్యత్తు తెలుసుకోవలనుకుంటే జాతక చక్రము అత్యావశ్యమైనదిగా చెప్పబడింది. జ్యోతిషమనే మహాసముద్రములో జాతకము ఒక నీటి బిందువులాంటిది. అటువంటి జాతకచక్రము వేయటానికి ముందు మన రాశి, నక్షత్రములను తెలుసుకోవటం ఎలాగో నేర్చుకుందాము. ఈ జ్యోతిషపాఠాలు క్రమం తప్పకుండా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఒక పాఠం చదవకపోయినా ఎంతో సమాచారాన్ని కోల్పోయినవారవుతారు.జన్మ రాశి - నక్షత్రం తెలుసుకునే విధానంమన రాశి, నక్షత్రం తెలుసుకోవాలంటే మనం పుట్టిన సంవత్సరానికి గణించబడ్డ దృగ్గణిత పంచాంగం మన వద్ద ఉండాలి. (మీరు జాతక సంబంధ ఏ గణితం చేసినా దృగ్గణిత పంచాగములతోనే చేయండి). ఆ పంచాంగములో ప్రతి రోజు తిథి, వార, నక్షత్ర, యోగ మరియు కరణాల అంత్యసమయాలు ఇవ్వబడతాయి. మీకు ప్రస్తుతం చంద్రస్థితి తెలిస్తే సరిపోతుంది. మీరు పుట్టిన రోజున చంద్రుడు ఏ రాశిలో ఉంటే అదే మీ జన్మరాశి అవుతుంది.ఉదా: తేది 26-03-2004 రోజున మధ్యాహ్నం 2 గంటలకు ఒకరు జన్మించారనుకోండి. ఆ రోజు ఆంధ్రపత్రిక (పిడపర్తి వారి) పంచాంగములో ఉదయం 06:58 వరకు కృత్తికా నక్షత్రం ఉన్నది.అంటే ఉదయం 06:58 నుంచి రోహిణి నక్షత్రం ఆరంభమవుతున్నది. ఇది తెల్లవారి ఉదయం 10:01 ని. వరకు ఉన్నది. అంటే 26-03-2004 ఉదయం 06:58 నుంచి తెల్లవారి(27-03-2004) ఉదయం 10:01 మధ్యలో ఎవరు జన్మించినా వారి నక్షత్రం రోహిణి అవుతుంది. రోహిణి నక్షత్రం వృషభరాశిలో ఉంటుంది. కనుక ఈ రోజు ఎవరు జన్మించినా వారిది రోహిణీనక్షత్రం, వృషభరాశి అవుతుంది.మీరు జన్మించిన సంవత్సర పంచాంగంలో, మీరు పుట్టిన తేదీకి ఏ రాశి, నక్షత్రాలున్నాయో చూడండి. ఒకవేళ మీ వద్ద ఆ సంవత్సరం పంచాంగం లేనట్లయితే నా వెబ్ సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. ఆన్ లైన్ జ్యోతిష్ డాట్ కామ్‌లో పంచాంగం పేజీలో, మీరు ఏ సంవత్సరానికైనా, ఏ తేదీకైనా పంచాంగాన్ని ఆన్లైన్లో తెలుసుకోవచ్చు.ఈ క్రింద ఇవ్వబడ్డ తేదీలకు రాశి, నక్షత్రాలు ఏవి వస్తాయో గణించి కామెంట్స్ ద్వారా కానీ, ఈ- మెయిల్ ద్వారా కానీ నాకు తెలియజేయండి.1. 11-10-1967, 10:10, హైదరాబాద్, 2. 24-04-1973, 06:00, ముంబై, 3. 10-08-2003, 12:00, విజయవాడ.తర్వాతి పాఠములో నక్షత్రపాదం తెలుసుకోవటం, జన్మనామం తెలుసుకోవటం ఎలాగో నేర్చుకుందాం. మీకు ఈ జ్యోతిష పాఠాలకు సంబంధించి ఏవైనా సందేహాలున్నా, సలహాలు, సూచనలు ఇవ్వదలచినా నాకు ఈ-మెయిల్ చేయవచ్చు.
నక్షత్ర పాద గణనగతపాఠంలో రాశి మరియు జన్మనక్షత్రాన్ని తెలుసుకోవటమెలాగో నేర్చుకున్నారు. ఈ పాఠములో ముందుగా నక్షత్రపాదం లెక్కించటమెలాగో తెలుసుకుందాము. గత పాఠములో ఇచ్చిన రాశి, నక్షత్రాలు మీకు ఈపాటికి కంఠస్థమై ఉంటాయని భావిస్తున్నాను. ఒకవేళ వాటిని కంఠస్థం చేయక నిర్లక్ష్యం చేస్తే మీరు జ్యోతిషం నేర్చుకోవటం విషయంలో మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవలసి ఉంటుంది.ప్రతి నక్షత్రం నాలుగు పాదాలుగా విభజించబడింది. 27 నక్షత్రాలు 108 పాదాలుగా రాశిచక్రములో విభజింపబడ్డాయి. ఒక్కో పాదానికి ఒక్కో అక్షరం ఇవ్వబడింది. ముందు నక్షత్ర పాదాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. నోట్ పాడ్, కాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొండి.ఉదా:- ఒక వ్యక్తి 05-04-2004 రోజున ఉదయం 10గంటలకు జన్మించాడనుకోండి. ఆరోజు పిడపర్తివారి పంచాంగానుసారం హస్తా నక్షత్రం సాయంత్రం 06గంటల39నిమిషాల వరకు ఉన్నది. గడిచిన రోజు రాత్రి 8 గంటల నాలుగు నిమిషాలకు ఆరంభమయ్యింది. నక్షత్రం ఆరంభమునుంచి అంత్యము వరకు గల సమయాన్ని లెక్కించండి. ఇవ్వబడిన నక్షత్ర ఆద్యంత సమయము 22 గంటల 35 నిమిషములు. దీనినే రుక్షాద్యంతము అని అంటారు.(రుక్షము అంటే నక్షత్రము అని అర్థము).ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు. ఈ నాలుగు పాదాలు గడవటానికి పట్టిన సమయం 22గంటల 35 నిమిషాలు అయినప్పుడు ఒక పాదం గడవటానికి ఎంత సమయం అవుతుంది. ( 22 60 ్శ 35 / 4 ్స ? ) దాదాపు 5 గంటల 39 నిమిషాలు.నక్షత్ర ఆరంభ సమయం నుంచి జన్మ సమయం వరకు అయిన సమయాన్ని లెక్కించండి. 13 గంటల 56 నిమిషములు. దీనిలో రెండుపాదాల సమయం అంటే 11 గంటల 18 నిమిషాలు గడిచిపోగా ఇంకా 2గంటల 38 నిమిషాలు శేషం మిగిలిఉన్నది. అంటే జాతకుని జన్మ సమయానికి హస్తానక్షత్రము రెండు పాదాలు గడిచి మూడవపాదం నడుస్తున్నది. అంటే జాతకుడు హస్తానక్షత్రం 3వ పాదములో జన్మించాడని తెలుస్తున్నది.మళ్ళీ ఒకసారి గమనిస్తే ముందుగా జాతకుడు జన్మించిన నాటి నక్షత్ర ఆద్యంతాలను తీసుకొండి. దానిని 4చే భాగించండి. జాతకుడు జన్మిచిన సమయానికి ఎన్ని పాదాలు కొట్టుడుపోతున్నాయో గమనించండి. శేషం ఏ పాదములో పడుతున్నదో గమనించండి.అదే ఆ జాతకుని జన్మ నక్షత్రపాదం. తర్వాతి పాఠములో ప్రతి నక్షత్ర పాదానికి గల జన్మ నామాక్షరాలను, వాటికి వచ్చే పేర్లను తెలుసుకుందాం. శెలవు.
hello, these are copied from my website https://www.onlinejyotish.com without my permission. please remove them
ReplyDeleteDasavidanam cheppandi
ReplyDeleteసూర్యుడు ఎన్ని డిగ్రీలో ఉన్నాడో రాశిలో ఎలా తెలుస్తుంది
ReplyDelete